జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా* _రామన్నపాలెంలో తొలిఅడుగు_
జండా మోసిన ప్రతికార్యకర్తకు అండగా ఉంటా …
-ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
-రామన్నపాలెంలో తొలిఅడుగు
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డిలు రాజకీయాల్లోకి రావడం నెల్లూరు ప్రజల అదృష్టమని టిడిపి జిల్లా అధ్యక్షులు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కొడవలూరు మండలం లోని రామన్నపాలెం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి అయన పాల్గొన్నారు
కొడవలూరు మండలం లోని రామన్నపాలెం పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తో కలిసి అబ్దుల్ అజిత్ పాల్గొన్నారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు. గ్రామంలో నాయకులు అలకలు మాని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. . ముఖ్యమంత్రి చంద్రబాబు,నారా లోకేష్ , వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కోవూరు నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, కొడవలూరులో నిరుద్యోగ యువత లేకుండా ఇఫ్కో, మితాలి వంటి పరిశ్రమలు ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు.అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వేమిరెడ్డి లాంటివారు రాజకీయాలకు రావటం ప్రజలకుఅదృష్టమన్నారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.