నా భర్త హత్యకు గురై నెలలు గడుస్తోంది
అయినా…అధికారులు న్యాయం చేయలేదు
కలెక్టరేట్లో భార్య వేళాంగణి ఆవేదన
కలెక్టర్ సారూ…మీరైనా న్యాయం చేయండి
- నా భర్త హత్యకు గురై నెలలు గడుస్తోంది
- అయినా…అధికారులు న్యాయం చేయలేదు
- కలెక్టరేట్లో భార్య వేళాంగణి ఆవేదన
నెల్లూరు అయ్యప్పగుడి సెంటర్లో…కొన్ని నెలల క్రితం చిన్నయ్య అనే వ్యక్తిని కొందరు హత్య చేసిన విషయం తెలిసిందే. దీంతో మృతుడి భార్య వేళాంగణి తనకు న్యాయం చేయాలని… జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నెలలు గడుస్తున్నా… సరైన న్యాయం చేయడం లేదని…కనీసం సమాధానం కూడా చెప్పడం లేదని వాపోయింది. కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్ ను కలసి వినతి పత్రం అందచేశారు. తన భర్త చనిపోయి నెలలు అయ్యిందని…ముగ్గురు పిల్లలు ఉన్నారని, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కలెక్టర్ సారైనా తనకు న్యాయం చేయాలని…మీడియా ఎదుట వేళాంగణి ఆవేదన వ్యక్తం చేసింది.