వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
కొండా ప్రవీణ్ శంకర్ నేతృత్వంలో రక్తదాన శిభిరం
రక్తదానం ప్రాణదానంతో సమానం
వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి
కొండా ప్రవీణ్ శంకర్ నేతృత్వంలో రక్తదాన శిభిరం
నిండు ప్రాణాలను కాపాడేందుకు రక్తదాన శిబిరాలు దోహదపడతాయని, యువత ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు సిటీ 6 డివిజన్ లో రక్తదాన శిభిరం ఏర్పాటు చేసారు.
ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో 6 డివిజన్ టిడిపి అధ్యక్షుడు కొండా ప్రవీణ్ శంకర్ నేతృత్వంలో లో రక్తదాన శిభిరం నిర్వహించారు. నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధిలో ఉన్న వైవిఎం హైస్కూల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యి రక్తదాతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రెడ్ క్రాస్ లో రక్త నిల్వ ల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. అలాగే నిరుపేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలతో పాటు మందులు అందించే మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. . ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వెంకటేశ్వర్లు,స్థానిక తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు