ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి -ఇందుకూరుపేట , రాముడు పాళెం లో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం
ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చా
- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
-ఇందుకూరుపేట , రాముడు పాళెం లో
సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం
కూటమి పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు..
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాముడు పాళెం పంచాయతీ పరిధిలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.వెంకటేశ్వర పురం కాలనీ, గంగపట్నం పంచాయతి వేప చెట్టు దిబ్బ లో తొలి అడుగు సుపరిపాలవ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో ఆమె ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు …
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఏడాదిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రానున్న నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని అన్నారు..ప్రజాసేవ కోసమే తానురాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు.జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈనెల అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న అమలు చేయనున్న మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలు చేసి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..