ఎన్ని కేసులైనా పెట్టుకోండి – మీడియా సమావేశంలో అనిల్ హాట్ కామెంట్స్
పెద్దిరెడ్డి అంటే CMకి వణుకు
- ఎన్ని కేసులైనా పెట్టుకోండి
- మీడియా సమావేశంలో అనిల్ హాట్ కామెంట్స్
పెద్దిరెడ్డి అంటే CM చంద్రబాబుకు భయమని, చిత్తూరులో ఆయన కుటుంబాన్ని అణిచి వేయాలనే కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయ కక్షల్లో భాగంగానే MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా YCP మరింత బలంగా ముందుకు వస్తుందన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదన్నారు. MP త్వరలో భయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.