FRS రద్దు చేయాలి…అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ప్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
పని చేయని ఫోన్లు ఎందుకు…?
FRS రద్దు చేయాలి…అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి
- అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ప్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
ప్రభుత్వం ఇచ్చిన పని చేయని ఫోన్లతో…,చాలీ చాలని జీతాలతో అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు… నెల్లూరులోని సీడీపీవో కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లలో యాప్ లు సక్రమంగా పని చేయడం లేదని అంగన్వాడీలు తెలిపారు. వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి…FRS రద్దు చేయాలని…అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, నాయకురాళ్లు మీడియాతో మాట్లాడారు.