నమ్మించారు.. రూ. కోట్లు కొట్టేశారు..!

నెల్లూరులో లోన్ల పేరిట భారీ మోసం

56 మంది గిరిజనులను నట్టేటా ముంచిన కేటుగాళ్ళు

రూ.10.60 కోట్లు కొల్లగొట్టిన మాయగాళ్ళు

పది కోట్లకు పైగానే….స్కామ్
గిరిజనులను నట్టేట ముంచేసిన కేటుగాళ్లు

  • సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేసీన చీటర్లు
  • విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
  • బాధితులకి న్యాయం చేయాలి
  • మీడియా సమావేశంలో కేసీ పెంచలయ్య డిమాండ్

నెల్లూరులో భారీ స్కాం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 56 మంది గిరిజనుల పేరిట యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు రూ. 10 కోట్ల 60 లక్షల మేర నగదును కేటుగాళ్లు స్కాం చేశారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి.. వారి పేరు మీద లోన్లు అప్లై చేశారు. వీరిలో ఇద్దరు బాధితులు….యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్సులు కేసీ పెంచలయ్యను ఆశ్రయించి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ మేరకు ఆయన నగరంలోని వెన్నలకంటి రాఘవయ్య భవన్ లో బాధితులతో కలసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పేద గిరిజనులను మోసం చేయడం దారుణమన్నారు. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులు గిరిజనులను మోసం చేశారన్నారు. ఇంత పెద్ద స్కాం జరిగినా నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం సబబు కాదన్నారు. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే విచారించి…బాధితులకి న్యాయం చేయడంతోపాటు… భారీ స్కాంకి పాల్పడ్డ ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేయాలని పెంచలయ్య డిమాండ్ చేశారు. అనంతరం బాధితులు ఎలా మోస పోయారో తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *