పూర్తి కానీ ఇళ్లకు పూర్తి బిల్లుల ఆమోదం
కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ప్రజాధనానికి కన్నం
సమగ్ర విచారణకు డిమాండ్
కావాలి హోసింగ్ లో మెగా కుంభకోణం
-పూర్తి కానీ ఇళ్లకు పూర్తి బిల్లుల ఆమోదం
-కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి ప్రజాధనానికి కన్నం
- సమగ్ర విచారణకు డిమాండ్
కావలి హోసింగ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు ఫైనల్ బిల్ చేయించుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నేత మొడతల రమేష్ ఆరోపించారు.
కావలి హౌసింగ్ శాఖలో భారీ కుంభ కోణం జరిగిందా…? వేల సిమెంట్ బస్తాలు.. పదుల కొద్ది టన్నుల స్టీల్ ను ఇంటి దొంగలు మాయం చేశారా… ? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. చేసిన కుంభకోణాన్ని కప్పి పుచ్చుకునేందుకు మళ్ళీ ప్రజా ధనానికే కన్నం పెడుతున్నట్లు వారు ఆరోపిస్తునారు. నాడు వైసిపి ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన తిమింగలాలే కూటమి ప్రభుత్వంలోనూ కోన సాగిస్తున్నారని బీజేపీ నేత మిడతల రమేష్ అన్నారు. అక్రమాన్ని సక్రమం చేసేందుకు బిల్లులు పూర్తయిన ఇళ్లకు 3,400 బస్తాల సిమెంట్ ఇండెంట్ కు ఆమోదంతెలిపారని అయన ఆరోపించారు.
కావలి పట్టణంలో జగనన్న మెగా లే అవుట్ నిర్మాణానికి ప్రభుత్వం లబ్ధి దారులకు సిమెంట్, స్టీల్ మంజూరు చేసిందని . గోదాములో స్టాక్ ఉన్న 6 వేల సిమెంట్ బస్తాలు, 24 టన్నుల స్టీల్ సైలెంట్ గా మాయం చేశారన్నారు . ఈ వ్యవహారాన్ని హౌసింగ్ ఉన్నతాధికారులు ద్రువీకరించారని,. అసలు గోదాములో లేని సిమెంట్ లబ్ధిదారులకు ఇస్తున్నట్లు 3,400 బస్తాల సిమెంట్ కు అధికారులు ఎలా ఆమోదిస్తారని అయన ప్రశ్నించారు. అవినీతి చేసిన అధికారులను నీతిమంతులుగా చేసే కుట్రకు కావలిని ఒక ఫైలేట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గృహాలకు తలుపులు, ద్వారబంధాలు లేకుండానే కిటికీలు, మరుగుదొడ్లు నిర్మించకుండానే ఫైనల్ బిల్లులు చేసుకున్నారని,. దీంతో కూటమి ప్రభుత్వం బీసీ, ఎస్సీలకు అందించే 50 వేల రూపాయలు, ఎస్టీలకు అందించే 75 వేల రూపాయలను లబ్ధిదారులు కోల్పోయారన్నారు. . పేదలు నివాసానికి యోగ్యంకాని ఇళ్లను కట్టారని, పేదలకు ఇళ్లు ఉండాలన్న దేశ ప్రధాని సంకల్పాన్ని దెబ్బతీశారని బిజెపి నేత మిడతల రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ఆర్డీవో సమగ్ర విచారణ చేయించాలని కావలి ఆర్డీవో వంశీ కృష్ణ కు మిడతల రమేష్, నాయకులు పిర్యాదు