వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు
“బాబు షూరిటీ– మోసం గ్యారంటీ”పై చైతన్యం కలిగించాలి
పూజిత రెడ్డి
ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నించాలి
-వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు
- “బాబు షూరిటీ– మోసం గ్యారంటీ”పై చైతన్యం కలిగించాలి – పూజిత రెడ్డి
ప్రజల్లో “బాబు షూరిటీ– మోసం గ్యారంటీ” పై చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కాకాని. గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి అన్నారు. నెల్లూరుజిల్లా తోటపల్లి గూడూరు మండలంలో “రీ కాల్ చంద్రబాబు” మేనిఫెస్టో కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా , తోటపల్లి గూడూరు మండలంలో “రీ కాల్ చంద్రబాబు” మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా “రీ కాల్ చంద్రబాబు” క్యాంపెయిన్‌లో భాగంగా క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల్లో “బాబు షూరిటీ– మోసం గ్యారంటీ” అనే చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని, గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా, హామీలు అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం మాత్రమే కొనసాగుతోందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చిల్లకూరు సుధీర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ శంకరయ్య గౌడ్, ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, వైసిపి కార్యకర్తలు నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.