సంతకాలు తీసుకొని మోసం చేశారు

దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరు

సైదాపురంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన

సంతకాలు తీసుకొని మోసం చేశారు…

  • దూరం వెళ్లి తమ పిల్లలు చదువులు సాగించలేరు
  • సైదాపురంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన

కిలో మీటరు దూరం వెళ్ళి తమ పిల్లలు చదువులు సాగించలేరని… మా గ్రామంలోనే పాఠశాల ఉండాలని ఎమ్మార్పీఎస్ నాయకులు,విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా సైదాపురం మండలంలోని పోతేగుంట పాఠశాల వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని పోతేగుంట అరుందతీయవాడలో ఏర్పాటై ఉన్న పాఠశాల తరగతులను… కిలోమీటర్ దూరంలో ఉన్న పోతేగుంట పాఠశాలకు అధికారులు మార్చడం సబబు కాదన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, స్థానికులు మాట్లాడుతూ… మా కాలనీలో ఉండే పాఠశాలలో 28 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, పోతేగుంట పాఠశాలలో పదకొండు మంది మాత్రమే ఉన్నారన్నారు. అలాంటిది మా పిల్లలను కిలోమీటరు దూరంలో ఉన్న పాఠశాలకు పంపించాలంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. తల్లికి వందనం కోసం అని టీచరు చెప్పి… మాచేత సంతకాలు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. మా పాఠశాలను మా కాలనీలోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *