విద్యార్థులకు అండగా సోమిరెడ్డి ఫౌండేషన్
ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు
పేదగిరిజన విద్యార్థులకు చేయూత
విద్యార్థి బాధ్యత…సోమిరెడ్డి ఫౌండేషన్ దే
-విద్యార్థులకు అండగా సోమిరెడ్డి ఫౌండేషన్
- ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు
-పేదగిరిజన విద్యార్థులకు చేయూత
ఇటీవల ముత్తుకూరులో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ లో ఓ హామీ ఇచ్చిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారం రోజులు గడవక ముందే ఆ హామీని నెరవేర్చి గిరిజనులపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏ సమావేశానికి హాజరైనా ఆయన ప్రసంగంలో నిత్యం గిరిజనుల గురించి, విద్యార్థుల గురించి ప్రసంగించే సోమిరెడ్డి ఆ ప్రసంగాలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న మల్లిక వర్షిత అనే గిరిజన బాలికను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సోమిరెడ్డి ఈ రోజు ఆ బాలిక బాధ్యతలను లాంచనంగా తీసుకున్నారు. ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులురెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు వర్షిత తల్లిదండ్రులతో సమావేశమై నేటి నుంచి బాలికకు అవససరమయ్యే అన్నీ రకాల వసతులను సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా సమకూరుస్తామని చెప్పారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన నాగమౌనికకు రూ. 10వేలు, రెండో స్థానంలో నిలిచిన శ్రీలేఖకు 5వేల రూపాయల నగదును సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా టీడీపీ నేతలు అందచేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ…టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సోమిరెడ్డి శ్రుతిరెడ్డి ఆధ్వర్యంలో సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు. మల్లిక వర్షిత తల్లి మాట్లాడుతూ….తమ బిడ్డను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకువచ్చేలా మంచి చదువులు చదివిస్తామని తమను గుర్తించి సహకరిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అక్కయ్యగారి ఏడుకొండలు, షేక్ ఫఫిఉల్లా, సుంకర శ్రీనివాస యాదవ్ తదితరులు పాల్గొన్నారు.