తండ్రికి అప్పగించిన కలువాయి పోలీసులు
బాలిక సేఫ్…
- తండ్రికి అప్పగించిన కలువాయి పోలీసులు
మతిస్థిమితం లేక తప్పిపోయిన బాలికను కలువాయి పోలీసులు బాలిక తండ్రికి అప్పజెప్పిన సంఘటన నెల్లూరు జిల్లా కలువాయిలో చోటుచేసుకుంది.. కలువాయి బెస్తపాలెం కు చెందిన మేడిబోయిన చంద్రకి పెళ్లి అయ్యి పాప ఉంది. మొదటి భార్య భర్త, పాపను వదిలి వెళ్లిపోవడంతో చంద్ర ఇందుకూరు పేటలో మరో వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు..
మతి స్థిమితం సరిగ్గా లేని పాప ఈ నెల 16 వ తేదీ ఇంట్లో చెప్పకుండా రైలు ఎక్కి తిరుపతి వెళ్ళిపోయింది.. బాలిక తిరుపతి రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. కలువాయి ఎస్సై కోటయ్య కు సమాచారం ఇవ్వడంతో స్పందించిన ఎస్సై వారి తండ్రి వివరాలు సేకరించి వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఐసిడిఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఆ బాలికను వాళ్ళ తండ్రికి అప్పగించారు. పోలీసులు, అధికారులకి చంద్ర ధన్యవాదాలు తెలియజేశారు.