జడ్పీ చైర్ పర్సన్ ఆనం అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు
ప్రశాంతం…జడ్పీ సమావేశం
- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం
ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు
నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి హాజరు కాగా, శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఆనంద్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన హాజరయ్యారు. దివంగత మాజీ జెడ్పీ చైర్మన్ బాలచెన్నయ్య కు సంతాపంతో ప్రారంభమైన సభ రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, తల్లికి వందనం పథకాన్ని అద్భుతంగా అమలు చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను అభినందిస్తూ కావలి ఎం ఎల్ ఎ కృష్ణారెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడంతో సభ ప్రశాంతంగా ముగిసింది.