రాష్ట్రంలో ఐదు మున్సిపాల్ కార్పోరేషన్‌ల ఎంపిక
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డు అందుకున్న నారాయణ
స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు అందుకున్న మంత్రి పొంగూరు
రాష్ట్రంలో ఐదు మున్సిపాల్ కార్పోరేషన్‌ల ఎంపిక
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అవార్డు అందుకున్న నారాయణ
రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పోరేషన్లు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు ఎంపికయ్యాయి. ఇందులో విజయవాడ, తిరుపతి, గుంటూరు, జీవీఎంసీ విశాఖపట్నం, రాజమండ్రి కార్పోరేషన్లు అవార్డులకు ఎంపికయ్యాయి. ఈమేరకు గురువారం న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును మంత్రి నారాయణ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌తోపాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు, ఆయా కార్పోరేషన్ల అధికారులు హాజరయ్యారు.