పెంచలయ్య హాస్పిటల్ నిర్వాహకులపై అనుమానం
విచారణ కోరుతూ.. ఏఎస్పీకి వినతి ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నేత పందిటి సుబ్బయ్య డిమాండ్
శ్రీకాంత్ మృతిపై విచారణ జరపాలి
పెంచలయ్య హాస్పిటల్ నిర్వాహకులపై అనుమానం
విచారణ కోరుతూ.. ఏఎస్పీకి వినతి ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నేత పందిటి సుబ్బయ్య డిమాండ్
నెల్లూరు పెంచలయ్య హాస్పిటల్ లో డీ ఫార్మసీ విద్యార్థి శ్రీకాంత్ మృతికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని, శ్రీకాంత్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మృతుడి తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎ ఎస్పీ సౌజన్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పందిటి సుబ్బయ్య మాట్లాడుతూ.. డి ఫార్మసీ చదువుతున్న విద్యార్థి జానా శ్రీకాంత్ .. నెల్లూరులోని పెంచలయ్య వైద్యశాలలో అనుమానాస్పదంగా మృతి చెందాడని.. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తెలియకుండా.. మేమే బంధువులం అంటూ పెంచలయ్య వైద్యశాల సిబ్బంది పోస్ట్ మార్టంకి పూనుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకోమని.. పోరాడతామని ఈసందర్భంగా సుబ్బయ్య అన్నారు.