సీతారామపురం మండల టీడీపీ కోఆర్డినేటర్ చింతల శ్రీను
వెనుకంజలో ఉన్నాం..
ఇంటింటికీ వెళ్లండి..!
సీతారామపురం మండల టీడీపీ కోఆర్డినేటర్ చింతల శ్రీను
ఉదయగిరి నియోజకవర్గం.. సీతారామపురం మండలం మండల టిడిపి కార్యాలయంలో మండల టిడిపి కోఆర్డినేటర్ చింతల శ్రీను ఆద్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం స్ధానిక బస్టాండ్ కూడలిలో సుపరిపాలనలో తొలి అడుగు కర పత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండలంలో ఇప్పటికే ప్రారంభించామని.. అయితే మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొద్దిగా వెనకంజలో ఉందన్నారు. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాల లద్దిని ప్రజలకు వివరించి.. సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి జాషువా, మండల టిడిపి నాయకులు వెంగళ శెట్టి వెంకటేశ్వర్లు,సోమన బోయిన రాజశేఖర్, గాజులపల్లి చంద్రారెడ్డి, పసుపులేటి వికాస్ బాబు,ముత్తురు వెంకటసుబ్బయ్య, ఆలూరి వెంకటరమణయ్య, తురక వెంకటేశ్వర్లు, ఇజ్రాయిల్, నల్లి రామయ్య, తోట ఏడుకొండలు, పెద్ద గౌస్, విజయ్, తమ్మిశెట్టి రమణయ్య, శేఖర్, దాదిపోయిన లక్ష్మయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.