ఒకేసారి నాలుగు గుళ్ళలో చోరికి పాల్పడ్డ దుండగులు..
మొగళ్లూరు మాతమ్మ గుడిలో చోరీ
- ఒకేసారి నాలుగు గుళ్ళలో చోరికి పాల్పడ్డ దుండగులు..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగళ్లూరు లోని మాతమ్మ గుడి, రామాలయం ఆంజనేయస్వామి భద్రకాళి గుడులలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుడి గేటు తాళం పగులగొట్టి లోనికి వెళ్లి అమ్మవారి మెడ లోని ఏడు బంగారు మంగళసూత్రాలు, ముక్కుపుడక, హుండీని అపహరించుకు వెళ్లారు. మంగళ సూత్రాల పసుపు తాళ్ళను అక్కడే వదిలేసి తాళిబొట్లు పట్టుకెళ్లారు. దొంగలించిన ఆభరణాల విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.