వింజమూరులోని నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో హరితవనం
విద్యార్థులచే ర్యాలీ, మానవహారం
మానవాళి మనుగడకు చెట్లు శ్రీరామరక్ష..!
వింజమూరులోని నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో హరితవనం
విద్యార్థులచే ర్యాలీ, మానవహారం
ఉదయగిరి నియోజకవర్గం.. వింజమూరు మండల కేంద్రంలోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణ స్కూల్ నుండి ఎంఈఓ ఆఫీస్ వరకు విద్యార్థులు చేత ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంగ్లా సెంటర్లో మానవహారం నిర్వహించి, విద్యార్థులు నినాదాలు చేస్తూ సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్ అంటూ నినాదలు చేసారు. మానవజాతి మనుగడ కోసం చెట్లను పెంచాలని ఈసందర్భంగా నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీల తెలిపారు. ప్రతి ఒక్కరు చెట్లను నాటే బాధ్యత తీసుకోని, వాటిని సంరక్షిస్తే మనకు జీవితం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కొన్ని మొక్కలను ఎం ఈ ఓ ఆఫీస్ ప్రాంగణంలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ స్కూల్ డీన్ మల్లిఖార్జున, ఎం ఈ ఓ ఆఫీస్ సబార్డినేట్ మౌనిక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.