ఈనెల 22 నుంచి నెల్లూరు రూరల్‌లో రెవెన్యూ సదస్సులు
వీడియో సందేశాన్ని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే
భూ సమస్యలా.. మీ వద్దకే వస్తున్నాం..!
ఈనెల 22 నుంచి నెల్లూరు రూరల్‌లో రెవెన్యూ సదస్సులు
వీడియో సందేశాన్ని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే
మీ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి పోయారా..? అయినా.. సమస్య పరిష్కారం కాలేదా..? అయితే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పర్యవేక్షణలో.. రూరల్ నియోజకవర్గంలో ఈనెల 22 వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి గురువారం స్వయంగా ఓ వీడియో రూపంలో సందేశాన్ని విడుదల చేశారు. ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన వివరాలను వెళ్లడించారు. గ్రామాల్లో అనేక ఏళ్లుగా భూ సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించేందుకు ఈ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని ఈసందర్భంగా శ్రీధర్‌రెడ్డి వెళ్లడించారు.