విడవలూరు వైసీపీ నేత కాటంరెడ్డి నవీన్‌రెడ్డి,ఉదయ్‌భాస్కర్
ప్రసన్న ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం
విడవలూరు వైసీపీ నేత కాటంరెడ్డి నవీన్‌రెడ్డి,ఉదయ్‌భాస్కర్
ఈనెల 7వ తేదీన కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత కాటంరెడ్డి నవీన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన విడవలూరు మండల కేంద్రంలో,. మండల నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతిరోజు మండలాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ధర్నాలు చేస్తూ.. రౌడీషీటర్లు, గుండాల చేత మీడియా సమావేశాలు నిర్వహిస్తూ.. విచక్షణారహితంగా ప్రసన్నకుమార్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలు చేయిస్తూ.. ఆయన్ను మానసిక శోభానికి గురి చేస్తున్నారన్నారు. కూటమి నాయకులకు ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు గెలిపించింది ధర్నాలు చేయడానికి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టించడానికి కాదని, ప్రభుత్వ పథకాలపై శ్రద్ధ ఉంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్‌లేందుకు ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు అనపల్లి ఉదయ భాస్కర్, దాసరి కరుణాకర్, కొండూరు శ్రీనివాసులు, వైసిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.