ప్ర‌మాద‌పు అంచున సోమ‌శిల

ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌ని సీఎం, మంత్రులు

సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు యుద్ధం ప్రాతిపదికన పూర్తి చేయాలి

జ‌లాశ‌యాన్ని సంద‌ర్శించిన కౌలు రైతు, రైతు సంఘ నేత‌లు

ప్ర‌మాద‌పు అంచున సోమ‌శిల
ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌ని సీఎం, మంత్రులు
సోమశిల జలాశయం ఆప్రాన్ పనులు యుద్ధం ప్రాతిపదికన పూర్తి చేయాలి

జ‌లాశ‌యాన్ని సంద‌ర్శించిన కౌలు రైతు, రైతు సంఘ నేత‌లు

ఈనెల 15, 16 తేదీల‌లో జ‌రిగిన కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేర‌కు.. గురువారం కౌలు రైతు,రైతు సంఘం రాష్ట్ర నాయకులు సోమశిల జలాశయంను, నిలిచిపోయిన ఆఫ్రాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ హరిబాబు దెబ్బతిన్న ఆఫ్రాన్ పనులను యుద్ధ ప్రాతిపదిక మీద త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సోమశిల జలాశయం ప్రమాదపు అంచులో ఉన్నదని.. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఈ జలాశయం వరదకు దెబ్బతిన్న ఆఫ్రాన్ ను చూసి త్వరలోనే ఆఫ్రాన్ పనులను పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారు తప్ప.. పనులు పూర్తి చేయలేదని అన్నారు. జిల్లాలో ఉండే అన్ని చెరువులు, కాలువలో 200TMC ల నీరును నిల్వ ఉంచగలిగే.. ఈ ప్రాజెక్టు పనులను గాలికి వదిలేయడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వం లో నీటి పారుదల శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రి గా ఈ జిల్లావాసులే, ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి గా ఈ నియోజకవర్గం MLA గా ఆనం రామనారాయణరెడ్డి ఉండి కూడా ఈ స్థితిలో జలాశయం ను వదిలేయడం అంటే ఈ జిల్లా రైతాంగాని, ప్రజలను మోసం చేయడమే అని వార‌న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు బలరాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గురునాధం,సిపిఎం పార్టీ అనంతసాగరం మండల కార్యదర్శి అన్వర్ బాషా, రైతు సంఘం మండల నాయకులు ఉప్పలపాడు మస్తాన్, రాటకొండ పెంచలనాయుడు, దాదా మస్తాన్, CITU మండల నాయకులు మీరా మొహిద్దిన్, రసూల్, నాగులూరు వెంకటేష్, అంకయ్య,మస్తాన్, బాలేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *