గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీది
మీడియా సమావేశంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి_
ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్సీపి సిద్ధం
గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టీడీపీది
మీడియా సమావేశంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్ జే ఆర్ భవన్ లో.. వైసీపీ ఇన్‌ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సిపి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గతంలో మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర టిడిపి ది అని. ఇప్పటి మేనిఫెస్టోను తుంగలో తొక్కి.. ప్రజలను మోసం చేసిన విధానాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారని చెప్పారు. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తున్నామన్నారు. వైసిపి హయాంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన చరిత్ర జగన్ దేనని తెలిపారు. 2027 జెమిలి ఎన్నికల్లో కి వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.