కావలి పట్టణం తుపానునగర్ లో షేక్ సుకూర్ నివాసంలో చోరీ
చోరీ చేసిన వైనం సీసీ కెమేరాలో నమోదు
దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగింత
పట్టపగలే చోరీ…!
కావలి పట్టణం తుపానునగర్ లో షేక్ సుకూర్ నివాసంలో చోరీ.
చోరీ చేసిన వైనం సీసీ కెమేరాలో నమోదు
దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగింత.
జల్సాలకు అలవాటుపడిన యువత దొంగతనాలకు ఏమాత్రం వెనుకాడడంలేదు. పట్టపగలే చోరీలకు తెగపడుతున్నారు. గురువారం కావలి పట్టణంలోని తుపాన్ నగర్ లో మధ్యాహ్నం సమయంలో షుకూర్ అనే వ్యక్తి ఇంటిలో ఎవరూలేరని గుర్తించి ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఈ చోరీ వ్యవహారం సీసీ కెమెరాలో నమోదు కావడంతో గుర్తించిన ఇంటి యజమాని దొంగను పట్టుకున్నాడు. తన ఇంటిలో బీరువాలో సెల్ ఫోన్, కొంత నగదు చోరీ చేసినట్లు తెలిసింది. పట్టుకున్న దొంగను పోలీసులకు అప్పజెప్పారు. ఈ దొంగపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.