ప్లోరోసిస్ పై అవగాహన తప్పనిసరి
క్యాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవాలి
అవగాహన కల్పించిన జిల్లా ఫ్లోరోసిస్ అధికారిణి దివ్య
నీటి ద్వారానే ఫ్లోరోసిస్ సోకుతుంది..!
ప్లోరోసిస్ పై అవగాహన తప్పనిసరి
క్యాల్షియం ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవాలి
అవగాహన కల్పించిన జిల్లా ఫ్లోరోసిస్ అధికారిణి దివ్య
ప్లోరోసిస్ వ్యాధి పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్లొరోసిస్ అధికారిణి దివ్య కోరారు. సీతారామపురం మండలం స్ధానిక స్త్రీ శక్తి భవనంలో ప్లోరోసిస్ లక్షణాలపై ఏఎన్ఎం, ఆశావర్కర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ.. ఫ్లోరోసిస్ వ్యాధి నీటి ద్వారా సోకుతుందని.. తద్వారా దంతాలు, ఎముకలు, వెన్నెముక బిగుసుకుపోవడం, కాళ్లు వంకర్లు తిరగడం జరుగుతుందన్నారు. క్యాల్షియం ఎక్కువగా ఉండే పాలు గుడ్లు, విటమిన్ సి, ఈ.. ఉండేటువంటి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అనంతరం బసినేనిపల్లి పాఠశాలలో 3,4,5 తరగతుల విద్యార్థులకు ఫ్లోరోసిస్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాదికారిణి డాక్టర్ స్వప్న, డాక్టర్ నిఖిల్, ఎంపిహెచ్ఈవో మజీద్, హెల్త్ సూపర్వైజర్ రియాజ్, ఎల్టీ అనిత తదితరులు పాల్గొన్నారు.