పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు, కార్యకర్తలు
ఘనంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ జన్మదిన వేడుకలు.
-పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేతలు, కార్యకర్తలు
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ 63 వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అన్ని మండలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి.. గర్భిణీ స్త్రీలకు, తల సేమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. ఏర్పాటుచేశారు. అనంతరం అభిమానులు గజమాలతో ఎమ్మెల్యేను సన్మానించారు. ఎమ్మెల్యే చే.. భారీ కేక్ కట్ చేయించి.. అందరికీ పంచిపెట్టారు. అలాగే.. నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు, పోలీసులు మర్యాదపూర్వకంగా వచ్చి.. ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షులు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.