కావలిలో విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ సమీక్ష_
స్వర్ణాంధ్రాలో స్వర్ణ కావలినే లక్ష్యం..!
కావలిలో విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలను సాకారం చేస్తామన్నా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న విజన్ 2047 కలను ఎమ్మెల్యేలుగా తాము సాకారం చేస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. విజన్ 2047 పై వివిధ ప్రభుత్వశాఖలతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఆర్డీవో వంశీ కృష్ణ బుధవారం కావలి ఆర్డీవో కార్యాలయంలో సమీక్ష జరిపారు. పీ ఫోర్ విధీ విధానాలు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. విజన్ 2047 స్వర్ణాంధ్రాలో స్వర్ణ కావలిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.