ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్
ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 127 మంది పారిశుద్ధ్య కార్మికులు, 36 మంది ఇంజనీరింగ్ వర్గం కార్మికులు నేటి నుంచి సమ్మె ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులు సిఐటియు నాయకులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను షరతుల్లేకుండా అమలు చేయాలి, గత సమ్మెలో కుదిరిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలి, ఉద్యోగ విభజనలో జరిగిన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించబోమని అవసరమైతే సమ్మెను ఉదృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. అధికారుల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సిఐటియు రాష్ట్ర నాయకులను చర్చలకు ఆహ్వానించి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు నేతలు రియాజ్, లక్ష్మయ్య, ఆటో డ్రైవర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.