హైకోర్టు ఆదేశాలతో 90రోజులపాటు కార్యక్రమం..
ఉచితంగా కేసులు పరిష్కరించేందుకు సులవైన మార్గం..
- హైకోర్టు ఆదేశాలతో 90రోజులపాటు కార్యక్రమం..
- ఉచితంగా కేసులు పరిష్కరించేందుకు సులవైన మార్గం..
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం దేశంకోసం. అవగాహన ర్యాలీ నిర్వహించారు…వెంకటగిరి జడ్జి, విష్ణువర్మ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగిందని అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో నేటినుండి 90 రోజులు పాటు మధ్యవర్తిత్వం దేశంకోసం కార్యక్రమంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయనీ. ఈ కేసులు మీడియేటర్ ద్వారా మండల న్యాయధికార సంస్థ ద్వారా ఉచితంగా కేసులు పరిష్కరించే మార్గం సులువైనదని తెలిపారు.. జిల్లాలో సుమారు మూడు నుంచి నాలుగు లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు.. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సీఐ రమణ. లాయర్లు రాంప్రసాద్. రాజేష్. లక్కమనేని కోటేశ్వరరావు. రాజారామ్. వెంకటగిరి. బాలాయపల్లి.డక్కిలి. సైదాపురం ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.