పదిమంది గాయాలు
- గ్రామంలోని 10 ఇళ్లలో చొరబడి ధ్వంసం..
- ముత్తుకూరు పిర్తాపూర్ వడ్డి పాలెంలో ఉద్రిక్తత..
- పోలీసుల రంగప్రవేశం..
నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, పిర్తాపూర్ పంచాయతీ పరిధిలోని కట్ట కింద ఉన్న వడ్డిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని 10 ఇళ్లలో చొరబడి అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇళ్లలోని ఫర్నిచర్, వాహనాలు, టీవీ, ఫ్రిజ్‌లు, బైక్లు ధ్వంసం శారు. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గాయపడ్డ వారిని పోలీసులు హుటాహుటిన రెండు అంబులెన్సుల ద్వారా నెల్లూరుకి తరలించారు.