దెబ్బ‌తిన్న‌వాడు..రేపు నా మాట కూడా విన‌డు..!

ప్ర‌స‌న్న ఇంటిపై ప‌చ్చ శాడిస్టుల దాడి_ _దాడిచేసిన‌వారిపై కాకుండా ప్ర‌స‌న్న‌పైనే కేసులు

ఈ త‌ప్పుడు సంప్ర‌దాయం రేపు విష వృక్షం అవుతుంది

తాడేప‌ల్లి ప్రెస్ మీట్‌లో ప్ర‌స‌న్న ఇంటిపై దాడి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన జ‌గ‌న్‌

దెబ్బ‌తిన్న‌వాడు
రేపు నా మాట కూడా విన‌డు..!
ప్ర‌స‌న్న ఇంటిపై ప‌చ్చ శాడిస్టుల దాడి
దాడిచేసిన‌వారిపై కాకుండా ప్ర‌స‌న్న‌పైనే కేసులు
ఈ త‌ప్పుడు సంప్ర‌దాయం రేపు విష వృక్షం అవుతుంది

తాడేప‌ల్లి ప్రెస్ మీట్‌లో ప్ర‌స‌న్న ఇంటిపై దాడి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన జ‌గ‌న్‌

తెలుగుదేశం పార్టీ నేతలు చేసే తప్పుడు సంప్రదాయం రేపు విషవృక్షం అవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఒక దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని.. ఇందులో భాగంగానే..
పథకం ప్రకారం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ ఇంటిపై పచ్చ శాడిస్టులు దాడి అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దాడి చేయించిన ఎమ్మెల్యే, అనుచరులపై ఎలాంటి కేసులు లేవన్నారు. దాడి చేసిన వారిపై కాకుండా నల్లపరెడ్డి పైనే కేసు పెట్టారని ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. తాడేప‌ల్లిలో జ‌గ‌న్ ఏర్పాటుచేసిన మీడియా స‌మావేశం సంద‌ర్భంగా న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి నివాసంపై దాడి విష‌యంపై ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ.. ఖండించారు.
రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతి చర్యగా.. ఇదే చేయడం మొదలెడితే..చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతల పరిస్థితి ఏమిటని ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. చంద్రబాబు నాయుడు వేసిన తప్పుడు విత్తనం చెట్టు అవుతుందని.. దెబ్బతిన్న వాడు రేపు నా మాట కూడా వినడంటూ.. జ‌గ‌న్ హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *