మొక్కులు చెల్లించిన రవించంద్ర
దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్సీ బీద
మొక్కులు చెల్లించిన రవించంద్ర
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలసిన దుర్గమ్మవారిని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు తో శాసన మండలి సభ్యులు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈసందర్భంగా బీదకు ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈసందర్భంగా బీద రవిచంద్ర అమ్మవారికి తన మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆశీస్సులు పొందారు.