త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ

గ్రామాలలో కక్షలకు దూరంగా.. కులాలకు, మతాలకు అతీతంగా

పార్టీల బేధం లేకుండా గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ

గ్రామాలలో కక్షలకు దూరంగా.. కులాలకు, మతాలకు అతీతంగా..
పార్టీల బేధం లేకుండా గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధం.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో దాదాపు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కందమూరు – ఉప్పుటూరు ప్రధాన రహదారి పనులకు నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డితో క‌ల‌సి.. బుధ‌వారం కంద‌మూరులో ప‌ర్య‌టించి.. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా వారికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం శ్రీ‌ధ‌ర్‌రెడ్డి మాట్లాడారు. 90 రోజుల్లో ఈ రోడ్డు ను పూర్తిచేసి ప్రజలకు అంకితం చేస్తామ‌న్నారు. సంవత్సర కాలంలోనే నెల్లూరు రూరల్ లో అభివృద్ధి పనులను అద్భుతంగా చేసామ‌న్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో 100కి 100 శాతం గెలిచితీరుతామ‌న్నారు. త్వ‌ర‌లో ప్ర‌భుత్వం రైత‌న్న‌ల‌కు అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కం అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *