ఉపసర్పంచ్ గా గున్నం సుశీల_ _ప్రకటించిన ఆర్వో తిరుమలయ్య
నెల్లూరు జిల్లా వింజమూరు మేజర్ పంచాయితీ ఉప సర్పంచ్ మీడదాల. జయలక్ష్మి రాజీనామా చేసిన సంగతి తెలిసినదే.ఈ క్రమంలోనే ఉప సర్పంచ్ ఎన్నిక జరగాల్సి ఉండగా ఈ రోజు వార్డు సభ్యులు సమక్షంలో అందరి అనుమతులతో ఏకగ్రీవంగా గున్నం. సుశీల పేరును ఆమోదించడం జరిగింది.పంచాయతీ వార్డ్ సభ్యులు 18 మంది ఉండగా కోరం సరిపోవడంతో గున్నం సుశీల పేరును బలపరిచి, ఆమోదించడం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరుమలయ్య మాట్లాడుతూ ఉపసర్పంచ్ ఎన్నిక సజావుగా సాగిందని, కోరం సరిపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పదవీ కాలం ఉన్నత వరకు ఉపసర్పంచ్ గా కొనసాగడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ రామారావు,ఈ ఓ పి ఆర్ డి గోపి శ్రీనివాస్,సర్పంచ్ సృజన, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.