అది మా సంస్కృతికాదు
అరగంటలో నీ ఇంటి పునాదులు పెకిలిస్తాం
అది మా సంస్కృతికాదు..!
చెల్లి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా..?
నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కడుపున దద్దమ్మ పుట్టడం దురదృష్టకరం
మాజీ ఎమ్మెల్యే ప్రసన్నపై మండిపడ్డ నుడా ఛైర్మన్ కోటంరెడ్డి
మహిళా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై పనికిమాలిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాలనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలింగిచాయని.. సాక్షాత్తు హైకోర్టు కూడా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ ముట్టిక్కాయ వేసిందంటూ.. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన బుధవారం నెల్లూరు నగరంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. ఆడవారిని దేవతగా పూజించే సంప్రదాయం మనదని.. ఆడవారిని దూషిస్తే.. రాజ్యాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. జిల్లా చరిత్రలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డిది ఓ చరిత్ర అని.. అటువంటి వ్యక్తి కడుపున పనికిమాలిన దరిద్రుడు, దద్దమ్మ పుట్టడం దురదృష్టకరం అంటూ మండిపడ్డారు. ఆ నాడు అసెంబ్లీలో చంద్రబాబునాయుడు సతీమణిని దూషిస్తే.. ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో.. గుర్తుంచుకోవాలని ప్రసన్నా… అంటూ హితువు పలికారు. రాజకీయాల్లో ఉద్యమాలు, సద్విమర్శలు చేయడం సాధారణమని.. ఓ ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రతి రోజూ.. కొందర్ని పోగేసి.. ప్రెస్‌మీట్లు పెట్టించి.. మాట్లాడిస్తావా..? నువ్వు సై అంటే.. ఐదు నిమిషాల్లో లేపేస్తావా..? అంత దమ్ముందా..? ధైర్యం ఉందా…? ఉంటే.. రా..? తేల్చుకుందాం.. అంటూ ఈసందర్భంగా కోటంరెడ్డి సవాల్ విసిరారు. అరగంటలో మీ ఇంటి పునాధులకూడా పెకలించగల దమ్ము, సత్తా వీపీఆర్ అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు ఉందని.. అయితే అది మా సంస్కృతి కాదన్నారు. స్వయానా సోదరి అయిన ప్రశాంతిరెడ్డిపై మాట్లాడ్డం సబబుకాదన్నారు. ఇంకా అనేక విషయాలను ఈసందర్భంగా నుడా ఛైర్మన్ వెళ్లడిస్తూ.. ప్రసన్నకుమార్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సమావేశంలో.. టీడీపీ నాయకులు కువ్వారపు బాలాజీ, కప్పిర శ్రీనివాసులు, సత్య నాగేశ్వరరావు, చిన్నబ్బయ, జహీర్, తదితరులు పాల్గొన్నారు.