డ్రైనేజీ సమస్యతో అల్లాడిపోతున్నాం
స్పెషల్ ఆఫీసర్ కి వినతి పత్రం అందచేసిన అన్నారెడ్డిపాళెం గ్రామస్థులు
సార్…అధికారులు పట్టించుకోవడం
- డ్రైనేజీ సమస్యతో అల్లాడిపోతున్నాం
-స్పెషల్ ఆఫీసర్ కి వినతి పత్రం అందచేసిన అన్నారెడ్డిపాళెం గ్రామస్థులు
నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీఓ కార్యాలయంలో అన్నారెడ్డిపాలెం గ్రామస్తులు తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్ కు వినతి పత్రం అందజేశారు. మురుగునీటి వలన దోమల బెడద తో అవస్థలు పడుతున్నామని అన్నారు. అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. సచివాలయం అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. తమ వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.