మంత్రి నారాయణ – తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి
ఇంటింటికెళ్లి అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన నారాయణ
త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు….
-మంత్రి నారాయణ
- తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగులో పాల్గొన్న మంత్రి
-ఇంటింటికెళ్లి అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించిన నారాయణ
రెండు,మూడు నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని తాడేపల్లి గూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మంత్రికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక టీడీపీ ఇంచార్జి వలవల బాబ్జీ తో కలిసి 19 వ వార్డులో ఆయన పర్యటించారు. ఇంటింటికెళ్లి గత ఏడాదిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 19వ వార్డులో మురుగు నీరు నిలువ ఉండటంతో డ్రైనేజీ నిర్మాణానికి తక్షణమే 85 లక్షలను మంత్రి కేటాయించారు. వార్డులోని భాగ్యలక్ష్మీ పేట లో సీసీ రోడ్డు నిర్మాణానికి తక్షణ ఆమోదం తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం తిరిగి ప్రారంభించామని…త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.