కోవూరు తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
త్వరగా క్లియర్ చేయాలి…
- కోవూరు తాసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నెల్లూరు జిల్లా కోవూరు మండలం తహాసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తాసిల్దార్ సుబ్బయ్యను వీఆర్వోలను మండలంలోని పలు వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డుల రూమును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ…సాధారణ తనిఖీ లో భాగంగా కోవూరు తాసిల్దార్ కార్యాలయం విజిట్ చేయడం జరిగిందని తెలిపారు సంవత్సరం పాటు ఉన్న పిజిఆర్ఎస్ పిటిషన్ను పరిశీలించామని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా పిజిఆర్ఎస్ పిటిషన్ను పరిశీలిస్తున్నామన్నారు. అందరూ కూడా పి జి ఆర్ ఎస్ పిటిషన్ను త్వరగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.