కావలిలో సిపిఎం నిరసన_
వ్యతిరేకించిన విధానాలనే అమలు చేస్తారా…?
- కావలిలో సిపిఎం నిరసన
నెల్లూరు జిల్లా కావలి విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం సీపీఎం నాయకులు నిరసనలు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం విధించిన వివిధ రకాల విద్యుత్ భారాలను, విధానాలను వ్యతిరేనిచిన కూటమి పార్టీలు, వారు అధికారంలోకి వచ్చాక ఏవైతే వ్యతిరేకించారో వాటినే అమలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూఅప్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విద్యుత్ శాఖ టెక్నికల్ ఎఈ సుబ్రమణ్య స్వామి కి వినతిపత్రం అందజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.