వ డివిజన్లో ఘనంగా వేమిరెడ్డి జన్మదిన వేడుకలు_ _కాకర్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం_
వీబీఆర్ ఆపద్బాంధవుడు…
-3వ డివిజన్లో ఘనంగా వేమిరెడ్డి జన్మదిన వేడుకలు
- కాకర్ల గోవర్ధన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం
ఆపదలో ఉన్న నిరుపేదలకు సాయం చేసే నాయకుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అని…టిడిపి నేత కాకర్ల గోవర్ధన్ అన్నారు. నెల్లూరు నగరం 3వ డివిజన్లో నారాయణ విద్యా సంస్థల జీఎం విజయస్కభార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.. నిరుపేదలకు అన్నదానం చేశారు. కాకర్ల గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… వీబీఆర్ దృష్టికి ఏ సమస్య తీసుకెళ్లినా తక్షణం స్పందించి పరిష్కరిస్తారన్నారు. ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు, కోవి రవణయ్య, పొత్తురు సైలజ, కోమరి విజయమ్మ, కృష్ణ ,మల్లి బుజ్జయ్య, చెన్నయ్య, శోభ, లక్ష్మి ,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.