ఇంటింటికెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని_
పంటపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు…
- ఇంటింటికెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పంటపల్లి పంచాయతీ జయదేవపురం కాలనీ, కుందేటివారిపల్లిలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి మహిళలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పంచాయతీలోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలను కొన్నింటిని అక్కడికక్కడే అధికారుల ద్వారా పరిష్కరిస్తూ..మరికొన్ని సమస్యలను త్వరితగతంగా పరిష్కరించాలని వారిని ఆదేశించారు. ఈ సందర్భంగా టిడిపి పాకాల మండలం మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి,చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి’ లు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో ప్రజలకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.