వ్యక్తిని హతమార్చిన నిందితులు_ _విరువూరులో దారుణ ఘటన_
కారణం అదే…
- వ్యక్తిని హతమార్చిన నిందితులు
-విరువూరులో దారుణ ఘటన
ఓ వ్యక్తిని హతమార్చి పెన్నానదిలో పూడ్చి పెట్టిన దారుణ ఘటన…విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది. నగదు లావాదేవీలు, పాత గొడవలే హత్యకు కారణమని నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు.
నగదు లావాదేవీల గొడవలు మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి ని హత మార్చి పెన్నానదిలో పూడ్చి పెట్టిన దారుణ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో చోటుచేసుకుంది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ… నెల్లూరు రూరల్ మండలం యనమల వానిదిన్నే గ్రామానికి చెందిన కాయల మోహన్ చంద్ కు, తరుణ్ కుమార్ రెడ్డికి నగదు లావాదేవీలు విషయంలో పాత గొడవలు ఉండేవి. వాటిని దృష్టిలో పెట్టుకుని తన స్నేహితులతో మోహన్ చంద్ ను కత్తి, జకీ రాడ్ తో కొట్టి హత్య చేశారన్నారు.. పొదలకూరు మండలం విరూవూరు గ్రామంలో గత బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ చంద్ కార్యక్రమం అనంతరం సాయంకాలం స్నేహితులందరూ మద్యం సేవించి ఆ మద్యం మత్తులో మోహన్ చంద్ ను హతమార్చి పెన్నా నదిలో మృతదేహంను పూడ్చి పెట్టారన్నారు..పరారీలో ఉన్న నిందితులను పట్టుకొని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.. నెల్లూరు రూరల్ డిఎస్పి, CI వేణు, పొదలకూరు CI రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ శివ కృష్ణయ్య ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీయించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం ను నెల్లూరుకి తరలించారు.