ఐదు తులాల బంగారం, 1 కేజీ వెండి స్వాధీనం_ _డీఎస్పీ పార్థసారథి_
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
- ఐదు తులాల బంగారం, 1 కేజీ వెండి స్వాధీనం
- డీఎస్పీ పార్థసారథి
నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్ధసారధి తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం డీఎస్పీ కార్యాలయంలో ఆయన నిందితుడుని మీడియా ఎదుట హాజరుపరచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కుప్పం రూరల్ సర్కిల్ పరిధిలో చోరీలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్ చేశామన్నారు. ముద్దాయి నుంచి 5 తులాల బంగారం, 1 కేజీ వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన శక్తివేలుగా గుర్తించామన్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. శక్తివేలును రిమాండ్కు తరలిస్తున్నట్టు డిఎస్పి పార్థసారధి తెలిపారు..