ప్రసన్న వ్యాఖ్యలపై సాల్మానుపురం కూటమి నాయకుల ధ్వజం
మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
సమాజం సిగ్గుపడేలా…
- ప్రసన్న వ్యాఖ్యలపై సాల్మానుపురం కూటమి నాయకుల ధ్వజం..
- మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి మాటల్ని వెనక్కి తీసుకొని…ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పాలని సాల్మానుపురం కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు.
మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం సాల్మానుపురం కూటమి నాయకులు అన్నారు.. లోటస్ గ్రాండ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ.. కించపరిచే వ్యాఖ్యలు వైసిపి నాయకులకు అలవాటుగా మారిందనీ బీజేపీ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి అన్నారు.. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతుందని హితవు పలికారు.. ఈ సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.. పెంచలరెడ్డి.. వెంకటేశ్వర్లు రెడ్డి.. రమేష్ రెడ్డి.. గోపిరెడ్డి.. మహేష్ రెడ్డి.. నరసయ్య.. నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.