గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనికను ఘనంగా సన్మానించిన రైతులు_
మౌనిక సేవలు ప్రశంసనీయం…
- గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనికను ఘనంగా సన్మానించిన రైతులు
నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పాటూరు పంచాయతీ సచివాలయ గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనిక పాటూరు సచివాలయం నుండి పొదలకూరు మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెని పాటూరు పల్లిపాళెం రైతులు ఘనంగా సన్మానించారు. రైతులందరికి మౌనిక ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. మౌనికను మహిళలు పూల వర్షంతో స్వాగతం పలికి అనంతరం శాలువాలు బొకేలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు మాజీ ఎంపీటీసీ అత్తిన వెంకోజిరావు, గండవరపు సుబ్రహ్మణ్యం,ప్రసన్న , వెంకటేశ్వర్లు బాలకృష్ణ .వెంకటరమణ, గోపాల్,రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు..