దిగొచ్చిన నెల్లూరు కమిషనర్..!_ _ఆమరణ దీక్షపై భాస్కర్‌తో అసోసియేషన్ సభ్యుల సమక్షంలో నెల్లూరు కమిషనర్ నందన్ చర్చలు_ _ఎన్-3 ఎక్స్‌క్లూజివ్_
తనను అక్రమ బదిలీ చేశారంటూ.. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద కావలి సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శి రేవెళ్ల భాస్కర్ చేస్తున్న ఆమరణ దీక్ష ఐదోరోజు చేరుకుంది. ఆదివారం సచివాలయం అసోసియేషన్ సభ్యుల సమక్షంలో భాస్కర్ తో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు నందన్ చర్చలు జరిపారు. కావలి కమిషనర్ శ్రావణ్ కుమార్ అక్రమాలను తాను ప్రశ్నించాననే సూళ్లూరుపేటకు తనను అక్రమంగా బదిలీ చేశారని,
తన బదిలీ రద్దు చేయాలని కమిషనర్ ను భాస్కర్ కోరాడు. సచివాలయాల అసోసియేషన్ సభ్యులు, కమిషనర్ సుదీర్ఘంగా చర్చలు జరిపి న్యాయం చేస్తామని, దీక్ష విరమించాలని కమిషనర్ కోరారు. సూళ్లూరుపేట బదిలీ రద్దు చేసి, కావలిలోనే నియమించాలని భాస్కర్ పట్టుబట్టాడు. చివరకు గుంటూరు జిల్లాకు శాశ్వత బదిలీ చేయిస్తామని కమిషన్ హామీ ఇచ్చారని, ఆర్డర్ వచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని భాస్కర్ ఈసందర్భంగా ఎన్-3 న్యూస్‌తో స్పష్టం చేశారు. మొత్తానికి కార్పోరేషన్ కార్యాలయంలో భాస్కర్ అమరణ దీక్ష వ్యవహారం చర్చలతో ఓ కొలిక్కి వచ్చినట్లైంది. గత ఐదు రోజులుగా అతను దీక్ష కొనసాగిస్తుండటంతో.. కొంత వరకు ఆరోగ్యం కూడా క్షీణించిందని భాస్కర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.