ఎస్సీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన డీడీ శోభారాణి_
ట్యూటర్లు లేకపోవడంతో డీడీ అసహనం…
- ఎస్సీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన డీడీ శోభారాణి
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని ఎస్సి బాలుర, బాలికల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహలను డీడీ శోభారాణి ఆకస్మిక తనిఖీ చేశారు.. ఈ సందర్బంగా ఆమె రెండు హాస్టల్స్ లో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు.. విద్యార్థులకు నోట్ బుక్స్ ఇస్తున్నారా..స్టడీ హవర్స్ నిర్వహిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్బంగా డీడీ శోభారాణి మీడియాతో మాట్లాడుతూ… కలువాయిలోని రెండు హాస్టల్స్ ని విజిట్ చేయడం జరిగిందన్నారు.. బాయ్స్ హాస్టల్ కి 14 లక్షలు, గ్లర్స్ హాస్టల్ కి రూ. 20 లక్షల 25వేల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులందకి నాణ్యవిద్యను అందించాలని సూచించారు. డీడీ విజిట్ కి వచ్చిన సమయంలో బాయ్స్ హాస్టల్ లో “వార్డెన్, స్టడీ హవర్స్ నిర్వహించే ట్యూటర్ ఇద్దరు లేకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేశారు..