నాకు తెలిసి నెల్లూరులో గాంధీ పార్కు ఒక్కటే ఉండేది
చిల్డ్రన్న పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి నారాయణ
పార్కులో మొక్కలు నాటిన మంత్రి_
చాలా సంతోషంగా ఉంది…
- నాకు తెలిసి నెల్లూరులో గాంధీ పార్కు ఒక్కటే ఉండేది
- చిల్డ్రన్న పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి నారాయణ
- పార్కులో మొక్కలు నాటిన మంత్రి
నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సిల్వర్ జూబ్లీ వేడుకలను…చిల్డ్రన్స్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి అసోసియేషన్ కమిటీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. కమిటీ సభ్యులు, టీడీపీ నేతలతో పార్కులో ఆయన మొక్కలు నాటారు. 25 ఏళ్ళ క్రితం పార్కు ఏర్పాటు చేసిన జేఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్కు కమిటీకి సహకారం అందించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ,చౌదరి బ్రదర్స్ నేతలను నారాయణ సన్మానించారు. క్రీడాపోటీల్లో ప్రతిభ కనబరిచిన వాకర్స్ కు బహుమతులు అందచేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ… నాకు తెలిసి నెల్లూరులో గాంధీ పార్కు ఉండేదన్నారు. డంపింగ్ యార్డుని 2000 సంవత్సరంలో చిల్డ్రన్స్ పార్కుగా టీడీపీ ప్రభుత్వం మార్చిందని గుర్తు చేశారు. నెల్లూరు సిటీలో మొత్తం 46 పార్కులు సిద్ధం చేసామన్నారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనూరాధ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ,నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు ,కార్పొరేటర్లు శ్రీకాంత్ రెడ్డి,కర్తం ప్రతాప్ రెడ్డి,పార్క్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్సులు రామ్మూర్తి ,పెద పెంచల ప్రసాద్ ,ట్రెజరర్ ప్రసాద్ కమిటీ సభ్యులు ,వాకర్స్ పాల్గొన్నారు .