గురుదేవోభవ..

విద్యాబ్ధులు నేర్పిన గురువుల్ని సత్కరించిన మంత్రి నారాయణ_ _నారాయణ నిగర్వి, నిరాడంబరుడంటూ గురువులు కితాబు_ _విఆర్సీలో పూర్వవిద్యార్ధులు, ఉపాధ్యాయుల సమ్మేళనం_ _బాల్య స్నేహితులతో అలనాటి స్మృతులు గుర్తుచేసుకొన్న మంత్రి_

ఆ..నాటి.. పాత‌.. జ్ఞాపకాలు
-త‌న‌కు విద్య నేర్పిన గురువు వేలుప‌ట్టుకుని..
వీఆర్ హైస్కూల్‌ను చూపించిన మంత్రి నారాయ‌ణ‌-నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. నారాయ‌ణ వెంట‌న న‌డిచిన మాస్టారు

నెల్లూరు వీఆర్ హైస్కూల్‌.. వేలాది మంది విద్యార్థుల‌కు విద్యా బుద్ధులు నేర్పింది.. ఆ మాస్టారు.. ఎంతో మందిని ఉత్త‌ములుగా తీర్చిదిద్దారు. బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేశారు.. ముఖ్యంగా మంత్రి నారాయ‌ణ‌కు చ‌దువు చెప్పిన గురువు. ఆ మాస్టారు 30 ఏళ్ల త‌ర్వాత ఆదివారం ఆ స్కూల్‌కు వ‌చ్చారు. అది కూడా పూర్వ విద్యార్థి.. మినిస్ట‌ర్‌.. పొంగూరు నారాయ‌ణతోపాటు తోటి పూర్వ విద్యార్థుల పిలుపుతో. మంత్రి నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో వీఆర్ హైస్కూల్‌ను పునఃప్రారంభించడం. ఆ నాటి స్కూల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయ‌డం తెలిసిందే. ఆదివారం ఆ స్కూల్‌కు వ‌చ్చిన త‌న మాస్టారు వేలు ప‌ట్టుకుని.. ఆ స్కూల్ మొత్తాన్ని తిప్పి చూపించారు. ఆ పాత జ్ఞాపకాలు కంటికి కనపడకపోయినా.. కొత్త‌గా.. స‌రికొత్త‌గా.. ఉన్న వీఆర్ స్కూల్‌ను చూస్తూ.. ఆ మాస్టారు క‌ళ్ల‌ల్లో ఆనందం క‌నిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *