మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రసన్న_ _మీడియా సమావేశంలో విడవలూరు టీడీపీ నేతలు_
ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే ఎలా అయ్యారో…?
- మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రసన్న
- మీడియా సమావేశంలో విడవలూరు టీడీపీ నేతలు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వావిళ్ళ పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు ఏటూరి శ్రీహరి రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు మాట్లాడుతూ… మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. మహిళలంటే అంత చులకనా నీకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పట్టా ఇచ్చారా మహిళలను తిట్టమని అంటూ ప్రసన్న కుమార్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళల పట్ల గౌరవం లేని మీరు ఆరుసార్లు ఎలా ఎమ్మెల్యే అయ్యారో అనే భ్రమలో కోవూరు ప్రజలు ఉన్నారు ప్రసన్న అంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ నాయుడు, విజయ రాఘవన్, బెల్లంకొండ శ్రీధర్, నాగేశ్వరరావు, శివ, శేషమ్మ, మండల నాయకులు,కార్యకర్తలు, విపిఆర్ అభిమానులు పాల్గొన్నారు.