సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే కురుగొండ్ల_
14వ వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం…
- సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యే కురుగొండ్ల
వార్డులోని డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఏడాది పాలనను ప్రజలకు తెలియజేశారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం 14వార్డు పరిధిలోని బొగ్గులమిట్టలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందచేశారు. కూరగాయల దుకాణంలోకి వెళ్లి రేట్లు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ కి వెళ్తున్న చిన్నారులను ఎమ్మెల్యే ఆపి వారితో సరదాగా గడిపారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల మీడియాతో మాట్లాడుతూ….వార్డులోని తల్లులందరికి తల్లికి వందనం పథకం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా…ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్న ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, రాష్ట్ర టిడిపి యువత అధ్యక్షులు ప్రసాద్, పట్టణ మాజీ ప్రెసిడెంట్ ఆనంద్, ఎస్సీ సెల్ మాజీ జిల్లా సెక్రెటరీ రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.